సాహోలో మరో లుక్ విడుదల
సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో సినిమాలో నటించిన ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధాకపూర్, లుక్స్కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అరుణ్ విజయ్ లుక్ను విడుదల చేశారు. తమిళంలో పలు సూపర్హిట్ చిత్రాల్లో విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్ సాహోలో అద్భుతమైన పాత్రలో మెప్పించబోతున్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.













