అర్జునవేట మొదలైంది
మధు సాయివంశీ, శ్రావణి నిక్కీ, హిమబింధు నటిస్తున్న చిత్రం అర్జునవేట. రామానాయుడు స్టూడియోలో షూటింగ్ మొదలైంది. కె.రవీంద్ర కల్యాణ్ దర్శకుడు. వాయల శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ఓ యదార్థ సంఘటన ఆధారంగా రైస్ పుల్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్నాం అని చెప్పారు. జులై 16 నుండి రెగ్యులర్ షూటింగ్ హైదారాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించి, ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తాం అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్, సంగీతం: డి.ఇమామ్.













