రణ్వీర్ జోడీగా షాలినీ పాండే
అర్జున్ రెడ్డి తో తెలుగులోకి బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్లో పరిచయం కాబోతున్నారు. మరి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్‌లో సినిమా, అందులోనూ యూత్ క్రేజీ స్టార్ రణ్వీర్ సింగ్ సరసన అంటే క్రేజీ ప్రాజెక్టే కదా. దివ్వాంగ్ తక్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జయేష్ భాయ్ జోర్దార్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ అవకాశం ద్వారా నా టాలెంట్‌ను బాలీవుడ్‌లోనూ చూపిస్తాను. రణ్వీర్ సింగ్ లాంటి సూపర్‌స్టార్‌తో కలసి నటించడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది అన్నారు షాలినీ పాండే. గుజరాత్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రంమిది. త్వరలో షూటింగ్ ఆరంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.













