పవన్ క్రిష్ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్ ఎంట్రీ..?
ఒకవైపు అయ్యప్పనుమ్ కౌషియం సినిమా చేస్తూనే మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీలో చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. క్రిష్ డైరక్షన్ లో పవన్ నటించడం ఇదే మొదటిసారి. పవన్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. భారీ బడ్జెట్ తో ఎ.ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పవన్ పక్కన ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే నిధి అగర్వాల్ ఎంపిక కాగా, మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నారట. అర్జున్ రాంపాల్ ను ఇటీవలే కలిసి స్క్రిప్ట్ డిస్కషన్ చేశాడట క్రిష్. సినిమా పట్ల అర్జున్ కూడా సానుకూలంగా ఉన్నాడని.. అన్నీ ఓకే అయితే త్వరలోనే పవన్ షూటింగ్ లో అర్జున్ కూడా జాయిన్ అయ్యే అవకాశముంది. ఈ సినిమాకు వీరమల్లు హరహర మహాదేవ్ టైటిల్ పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించిన విషయాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి.













