Malaika Arora Khan: మలైకాకు మాజీ ప్రియుడి బర్త్ డే విషెస్

బాలీవుడ్ భామ మలైకా అరోరా(Malaika arora) పుట్టినరోజు ఈరోజు. ఆమె బర్త్ డే సందర్భంగా ఎంతోమంది మలైకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. ఆమె ఫ్యాన్స్ నుంచి, సెలబ్రిటీల నుంచి మలైకాకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా ఆమె మాజీ ప్రియుడు అర్జున్ కపూర్(Arjun kapoor) కూడా విషెస్ చెప్పారు.
మలైకా పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే మలైకా, మీరెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలంటూ రాసుకుని వచ్చాడు. అర్జున్ చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ మలైకా కూడా థాంక్ యూ అని లవ్ సింబల్ ను జోడించి రిప్లై ఇచ్చింది. కాగా ఈ ఇయర్ జూన్ లో అర్జున్ కపూర్ బర్త్ డే సందర్భంగా మలైకా కూడా అతనికి విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఆరేళ్లపాటూ డేటింగ్ లో ఉన్న ఈ జంట గతేడాది విడిపోయారని వార్తలొచ్చాయి. అర్జున్ కపూర్ కూడా మొన్నామధ్య తాను సింగిల్ గా ఉన్నానంటూ బ్రేకప్ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. వారి బ్రేకప్ తర్వాత మలైకా తండ్రి మరణించడంతో అర్జున్, మలైకా ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించాడు. ఇటీవల ముంబై లో జరిగిన హోమ్ బౌండ్(homebound) ప్రీమియర్ కు హాజరైన వీరిద్దరూ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు.