ఎన్టీఆర్- చరణ్ ఫ్యాన్స్ మధ్య వాదనలు
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్, తన తర్వాతి సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు నెట్టింట వార్త చక్కర్లు కొడుతుంది. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి కాదనడానికి లేదు. మార్చి 20న ఈ సినిమాను ఓపెనింగ్ చేయనున్నారని వార్త వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ టైటిల్ ను గతంలో ఎన్టీఆర్ కోసం అనుకున్న సినిమా కోసం రిజిస్టర్ చేయించారని, తారక్ చేయాలనుకున్నా డేట్స్ అడ్జస్ట్ అవకపోవడంతో చేయలేని పరిస్థితిలో ఉండటంతో దాన్ని తన ఫ్రెండ్ అయిన చరణ్ దగ్గరకు పంపించినట్లు టాక్. కానీ అసలు నిజమేంటన్నది మాత్రం డైరెక్టర్ బుచ్చిబాబుకే తెలియాలి.
ఈ విషయంలో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ వాదించుకుంటున్నారు. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు ఒక హీరో వదులుకుంటే మరో హీరో చేసి మంచి హిట్ అందుకున్నారు. ఒక కథ ఒకరిని కాదని, మరొకరి దగ్గరకు వెళ్లిందంటే అది వారిదేనని అర్థం. అంతేకాదు, ఈ సినిమా కథ ఎన్టీఆర్ కు చెప్పింది కాదని, వేరే కథ అని బుచ్చిబాబు చెప్పిన వీడియో క్లిప్ ను ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో బుచ్చిబాబు మరోసారి క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్ చల్లబడరు.













