Nithya Menon: అలా చేయడానికి హీరోయిన్లు ఆట బొమ్మలా?

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మలయాళ నటి నిత్యా మీనన్(Nithya Menon) ఆ తర్వాత తన సొంత భాషలోనే హీరోయిన్ గా మారింది. మలయాళంతో పాటూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నిత్యా మీనన్ అందరి హీరోయిన్లలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుందనే తెలిసిందే. మొదటి నుంచి సెలెక్టివ్ సినిమాలు చేసే నిత్యాకు కాస్త తల బిరుసు ఎక్కువని అంటూ ఉంటారు.
అయితే మొన్నా మధ్య నిత్యా ఓ ఈవెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ బయట ఓ అభిమాని నిత్యాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తే నిత్యా అతనికి నమస్కారం చేసి తనకు జలుబు ఉందంటూ తప్పించుకుని లోపలికి వెళ్లింది. కానీ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడున్న హీరోకు హగ్ ఇచ్చింది నిత్యా. దీంతో ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ అమ్మడిని బాగా ట్రోల్ చేయగా తాజాగా ఈ విషయమై నిత్యా క్లారిటీ ఇచ్చింది.
ఎంతో మంది మగాళ్లు హీరోయిన్లను సగటు ఆడవారిలా కూడా భావించరని, హీరోయిన్లు అయితే వారిని ఈజీగా టచ్ చేయొచ్చని అనుకుంటారని, హీరోయిన్లు ఎలాంటి ఈవెంట్ కు వెళ్లినా షేక్ హ్యాండ్ అంటూ తమను టచ్ చేయడానికి ఎగబడతారని, సాధారణ ఆడవాళ్లను ఇలాంటి మగాళ్లు ఎప్పుడూ షేక్ హ్యాండ్ అడక్కుండా తమను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? ఈజీగా టచ్ చేయడానికి హీరోయిన్లేమైనా ఆట బొమ్మలా అని నిత్యా ఫైర్ అయింది. ఇక సినిమాల విషయానికొస్తే నిత్యా మీనన్ ధనుష్(dhanush) తో కలిసి ఇడ్లీ కడై(idly kadai) సినిమాతో పాటూ విజయ్ సేతుపతి(Vijay sethupathi)తో తలైవన్ తలైవి(thalavan Thalaiva) సినిమాలు చేస్తోంది.