ఆడియో వేడుక లేదు… ఆన్ లైన్ లోనే
ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 20న హైదరాబాద్లో నిర్వహించాలని మొదట భావించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది కూడా. కానీ ఆ వేడుకను రద్దు చేసుకున్నారు. ఆన్లైన్లోనే ఈ చిత్రం గీతాలను విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. ప్రీ రిలీజ్ వేడుక మాత్రం నిర్వహిస్తామని ప్రకటించింది. తేదీ ఎప్పుడున్నది మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథనాయిక. హారిక, హాసిని క్రియేషన్స పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు.













