అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అరవింద సమేత
అరవింద సమేత రిలీజైన ప్రతి సెంటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. యూఎస్‌లో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరి రికార్డును నెలకొల్పింది అరవింత సమేత. ఇదిలా ఉండగా, ఆన్లైన్లో బుక్ మై షో ద్వారా 1.2 మిలియన్ టికెట్స్ అమ్మకాలు జరిగాయి. మొదటి వీకెండ్లో ఇన్ని టికెట్స్ అమ్మకాలు జరుపుకున్న మొదటి సినిమాగా అరవింద సమేత నిలిచిందని సంస్థ సీఓఓ ఆశిష్ సక్సేనా వెల్లడించారు. ఓవరాల్‌గా చూసుకుంటే మొదటి వీకెండ్లో ఆన్లైన్ ద్వారా అత్యధిక టికెట్స్ అమ్మకాలు జరుపుకున్న సినిమాగా బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంటే, రెండో ప్లేస్‌లో అరవింద సమేత నిలిచింది.













