బాహుబలి కంటే అరణ్య కోసమే ఎక్కువ కష్టపడ్డాడట..!
రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య దేశ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయింది. ఈ వారంలో రాబోతున్న అరణ్యపై ఇంటర్వూలో రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా కోసం బాహుబలి కంటే ఎక్కువ కష్టపడినట్లు రానా చెప్పుకొచ్చాడు.
బాహుబలి కోసం రానా దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డాడు. భల్లాలదేవుడి పాత్ర కోసం దాదాపు వంద కేజీల బరువు పెరిగాడు. పాత్ర రెండు వేరియేషన్స్ చూపించడం కోసం రానా లుక్ పరంగా చాలా కష్టపడ్డాడనే విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి మించి అరణ్య సినిమాకు కష్టపడ్డానంటూ రానా అనడం ఆశ్చర్యంగా ఉంది. అరణ్య సినిమాలో ఏనుగులతో ఉన్న సన్నివేశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని రానా పదే పదే చెప్తున్నతరుణంలో సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ప్రభు సాల్మన్ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమాలో రానా అడవి మనిషి తరహాలో కనిపిస్తున్నాడు. ఏనుగుల సంరక్షణ కోసం కార్పోరేట్ సంస్థలతో పోరాడే వ్యక్తి పాత్రలో రానా ఈ సినిమాలో కనిపించనున్నాడు. లుక్ పరంగా ఇప్పటికే పాజిటివ్ మార్కులు దక్కించుకున్నాడు రానా. షూటింగ్ కు వెళ్లే వారం రోజుల ముందు నుంచే ఏనుగులను మచ్చిక చేసుకునే వాడినని, నేనెప్పుడెళ్లినా జేబులో అరటి పండ్లు పెట్టుకుని ఏనుగుల దగ్గరకు వెళ్లేవాడినని, ఒకసారి నా జేబులో ఉన్న అరటి పండ్ల కోసం ఒక్కసారిగా ఏనుగులు చుట్టుముట్టాయని, ఆ టైమ్ లో చాలా భయపడ్డానని రానా చెప్పుకొచ్చాడు.













