చరణ్- రెహమాన్ కాంబో.. టెన్షన్లో ఫ్యాన్స్
ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్న రామ్ చరణ్, అది పూర్తవ్వగానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడని, ఈ మేరకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది.
సినిమా షూటింగ్ మొదలయ్యే నాటికి దీని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీకి రెహమాన్ సంగీతం ఇస్తాడనే వార్త చరణ్ ఫ్యాన్స్ కు టెన్షన్ కలిగిస్తోంది. ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట వచ్చిన ఆయన ఆల్బమ్స్ సైతం ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి కానీ రెహమాన్‌కు టాలీవుడ్లో చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డుంది.
కెరీర్ స్టార్టింగ్‌లో వెంకటేష్ సూపర్ పోలీస్‌కు పనిచేశాడు రెహమాన్. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తర్వాత రాజశేఖర్ తో చేసిన గ్యాంగ్ మాస్టర్ కూడా అదే ఫలితాన్నిచ్చింది. ఆ తర్వాత కృష్ణం రాజు నటించిన పల్నాటి పౌరుషం కొంతవరకు పర్లేదు కానీ ఆ సినిమాకు రెహమాన్ స్పెషల్ గా కంపోజ్ చేసిన ట్యూన్స్ ఏమీ లేవు. రీమేక్ కావడంతో ఒరిజినల్ సాంగ్సే వాడుకున్నారు.కొమరం పులి సాంగ్స్ గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. ఏ మాయ చేశావె మంచి ఆల్బమే అయినా అది కూడా ముందు తమిళ్లో కంపోజ్ చేసిందే.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఫ్యాన్స్, చరణ్ కు ఈ కాంబో సెట్ అయితే ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో అనే భయం పట్టుకుంది. దానికి తోడు రెహమాన్ నుంచి గత పదేళ్లలో చెప్పుకోదగ్గ రీతిలో ఉన్న ఆల్బమ్ ఒక్కటీ రాలేదు. అలాంటప్పుడు బుచ్చిబాబు, రెహమాన్ నుంచి ఎలాంటి మ్యూజిక్‌ను తీసుకోగలడనేది ఇప్పుడు అందరికీ అనుమానంగా మారింది.













