ఏకంగా రెహమాన్‌కు వలేసిన బుచ్చిబాబు
రామ్ చరణ్ హీరోగా తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. చరణ్ కు జోడీగా ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనే యాంగిల్ లో ఎంతో మందిని పరిశీలిస్తున్నాడు బుచ్చిబాబు.
ప్రస్తుతం శంకర్‌తో గేమ్ ఛేంజర్ చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమా పూర్తవగానే ఈ సినిమాను సెట్స్ కు తీసుకెళ్లనున్నాడు. గేమ్ ఛేంజర్ తో చెర్రీ హిట్ కొడితే తన ఇమేజ్ మరింత పెరగడం ఖాయం. ఇలాంటివన్నీ చూసుకుని తన తర్వాతి సినిమాకు ఎలాంటి కాస్ట్ అండ్ క్రూ ని సెలెక్ట్ చేయాలనే దిశగా బుచ్చిబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ ని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తన స్టోరీకి మంచి అవుట్‌పుట్ ఆయన మాత్రమే ఇవ్వగలడని చాలా గట్టిగా నమ్ముతున్నాడట బుచ్చిబాబు. ఇందులో భాగంగానే రీసెంట్ గా చరణ్, బుచ్చిబాబు, శంకర్.. రెహమాన్ ని కలిసినట్లుగా మెగా కాంపౌండ్ నుంచి వార్తలందుతున్నాయి.
మరి చరణ్ కు ఈ సినిమా చేస్తానని రెహమాన్ మాటిచ్చాడా లేదా అన్నది తెలీదు కానీ టీమ్ రెహమాన్ ని కలవడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెహమాన్ గతంలో సైరా నరసింహారెడ్డికి పనిచేయాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్ లో రెహమాన్ బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అప్పట్లో ఈ విషయమై రెహమాన్ పై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. మరి ఈ సారైనా రెహమాన్ మెగా మూవీ చేస్తాడో లేదా చూడాలి.













