కరోనా కంటే భయంకరమైన నెపోటిజం బారిన పడ్డ ఎ.ఆర్.రెహమాన్
బాలీవుడ్లో నెపోటిజంకు సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నది నెపోటిజం కారణంగానే అని తెలియగానే దాని బారిన పడి నష్టపోయిన ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. వారిలో ఇప్పుడు సంచలన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కూడా చేరారు. బాలీవుడ్ సినిమాలు తనకు రాకుండా అడ్డుకునేందుకు ఒక ముఠా పనిచేస్తోందని రెహమాన్ ఆరోపిస్తున్నారు. సకాలంలో ట్యూన్స్ ఇవ్వడు అంటూ రెహమాన్ గురించి బాలీవుడ్లో ఆ ముఠా ప్రచారం చేస్తోందట. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించాడు రెహమాన్. సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా సినిమాకు మ్యూజిక్ చేసేందుకు రెహమాన్‌ను సంప్రదించాలని భావించాడు దర్శకుడు ముఖేష్ చబ్రా. కానీ, ఆ ముఠాకు చబ్రా తన దగ్గరకు రాకుండా అడ్డుకున్నారని, అయినా తనతో సుశాంత్ చివరి సినిమాకు మ్యూజిక్ చేయించుకున్నారని రెహమాన్ తెలిపారు. ఆయనకు రెండు రోజుల్లోనే నాలుగు ట్యూన్స్ చేసి ఇచ్చానని రెహమాన పేర్కొన్నారు.
ఆయనకు రెండు రోజుల్లోనే నాలుగు ట్యూన్స్ చేసి ఇచ్చానని రెహమాన పేర్కొన్నారు. తెలుగు, తమిళ్‌తోపాటు అనేక భాషల్లో ఆల్‌టైమ్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన రెహమాన్ హిందీలోనూ ఎన్నో అధ్భుతమైన పాటలు చేశారు. భారతదేశానికి తొలిసారి రెండు ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టిన ఘనత కూడా రెహమాన్‌దే. అలాంటిది అతనికే ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరమని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంచి సినిమా ఏది తన దగ్గరకు వచ్చిన తప్పకుండా మ్యూజిక్ చేస్తానని, అలాంటి సినిమాలకు నేను ఎప్పుడూ నో చెప్పలేదని ఈ సందర్భంగా రెహమాన్ గుర్తు చేశారు. ఏది ఏమైనా రెహమాన్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌కి ఈ అనుభవం ఎదురు కావడం ఆలోచించాల్సిన విషయమే.













