ఏ.ఆర్. రెహమాన్ ఇంట్లో విషాదం
ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగమ్ కన్నుమూశారు. చాలా కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వార్తను రెహామాన్ ట్విటర్లో తన తల్లి ఫొటో పోస్ట్ చేయడం ద్వారా పంచుకున్నారు. కరీమా బేగానికి నలుగురు సంతానం. వీరిలో ఏఆర్ రెహమాన్ చిన్నవాడు. కరీమా భర్త ఆర్కే శేఖర్ రెహమాన్ తొమ్మిదేళ్ల వయస్సులోనే మరణించారు. ప్రస్తుతం ఆయన తల్లి కూడా మృతి చెందారు. కరీమా బేగం మృత్తి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పలువురు ప్రముఖులు రెహమాన్‌కు సానూభూతి వ్యక్తం చేశారు.













