కేరళకు ఏఆర్ రెహ్మాన్ కోటి విరాళం
వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ రూ.కోటి విరాళం ప్రకటించారు. తనతోపాటు తన టీం తరపున కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్ఎఫ్)కి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రెహ్మాన్ వాషింగ్టన్లో జరిగిన షో సందర్భంగా ఈ ప్రకటన చేశారు. నేను నా సహచర కళాకారులతో అమెరికాలో పర్యటిస్తున్నా. వరదలతో ఇక్కట్ల పాలైన కేరళ సోదర సోదరీమణులకు ఉపశమనం కలిగించేందుకు కొద్ది మొత్తం సాయం చేస్తున్నా అని పేర్కొన్నారు.













