ఎఆర్ రెహమన్ కొత్త అవతారం
సినిమారంగంలో అభిరుచితో ఒక శాఖలోని వారు ఇంకో శాఖలోనికి ప్రవేశిస్తుంటారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన అభిరుచిని చాటుకుంటూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదీ ఆయన వృత్తికి ఎంతో సామీప్యమైన సంగీత ప్రధాన కథాంశానికి సంబంధించిన చిత్రం కావడం ఓ విశేషం. దీనికి 99 సాంగ్స్ అనే టైటిల్ను నిర్ణయించారు. కష్టాలు ఎదుర్కొనే ఓ గాయకుడి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్త్నుట్లు సమాచారం. విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎహాన్ భాట్, ఎడిల్సి వెరగాస్, మనీషా కొయిరాలా, లీసారే, థామస్ ఆండ్రూస్ ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు.













