AR Rahman: బుచ్చిబాబుకు రెహమాన్ ఎలివేషన్స్

థగ్ లైఫ్(thug Life) సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం కమల్(kamal hassan) ఫ్యాన్స్ తో పాటూ రామ్ చరణ్(Ram charan) ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరిచింది. దానికి కారణం ఈ రెండు సినిమాలకూ రెహమాన్(Rahman) మ్యూజిక్ డైరెక్టర్ అవడం. థగ్ లైఫ్ సినిమాకు రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏదీ ఆకట్టుకునేలా లేదు. దీంతో తమ హీరోకు రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని వారు తెగ కంగారు పడుతున్నారు.
అయితే సుకుమార్(sukumar) చెప్పినట్టు బుచ్చిబాబు(buchibabu) చాలా మొండోడు. తాను సినిమా కోసం ఏదైతే అనుకున్నాడో అది చేసే తీరుతాడు. పెద్ది(peddhi) విషయంలో బుచ్చిబాబు తీసుకున్న నిర్ణయాలు కూడా అలానే కనిపిస్తాయి. ఉప్పెన(Uppena) తర్వాత ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు స్టార్ హీరోతోనే సినిమా తీయాలని వెయిట్ చేసిన బుచ్చిబాబు, ఆ తర్వాత పెద్ది కోసం ఏకంగా రెహమాన్ ను మెప్పించి, ఒప్పించడం మామూలు విషయం కాదు.
అందుకే బుచ్చిబాబును తక్కువ అంచనా వేయడానికి లేదు. రీసెంట్ గా రెహమాన్, బుచ్చిబాబు గురించి ఇచ్చిన ఎలివేషన్లు కూడా దాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెద్ది సినిమాలోని సాంగ్స్ కోసం బుచ్చిబాబు రెహమాన్ కు ఒక్కో సాంగ్ కు మూడు సాంగ్స్ ను రిఫరెన్సులుగా ఇచ్చి వాటి ఆధారంగా తనకు ది బెస్ట్ ఇవ్వమని కోరారని, బుచ్చిబాబు రిఫరెన్సులుగా ఇచ్చిన సాంగ్స్ అన్నీ ఒకప్పుడు రెహమాన్ ఇచ్చిన ఛార్ట్ బస్టర్లలోవే అని, అవన్నీ చూశాకే బుచ్చిబాబుకు మ్యూజిక్ పై ఎంత పట్టుందో తనకు అర్థమైందని రెహమాన్ బుచ్చిబాబును ఆకాశానికెత్తేశాడు. దీన్ని బట్టి బుచ్చిబాబు పెద్ది విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదని అర్థమవుతుంది.