మురుగదాస్ తో రజనీ?
సంచలన దర్శకుడిగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురగదాస్ అటు హిందీలోనూ సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన విజయ్‌తో సర్కార్‌ను తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణ చివరిదశకు చేరడంతో, దసరాకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తరువాత మురుగదాస్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేస్తాడని టాక్. ఇప్పటికే కథ చెప్పి రజనీ అంగీకారం పొందాడని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో వున్న చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మురగ రజనీ చిత్రంపై పరిశ్రమలో ఆసక్తి కనిపిస్తోంది. ప్రస్తుతం రజనీ 2.0 విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతోపాటు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్న పెట్టా చిత్రం నవంబర్‌తో పూర్తికానుంది. వీటి తరువాత ఆయన మురుగదాస్ చిత్రం మొదలుపెట్టొచ్చు.













