3న ‘అప్పుడు ఇప్పుడు’ విడుదల
సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాతలు. శివాజీరాజా, పేరువు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. విశ్వనాథ్ గారు విడుదల చేసిన సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల 3న విడుదల చేస్తున్నాం అన్నారు. దర్శకుడు చలపతి వువ్వల మాట్లాడుతూ మా అప్పుడు ఇప్పుడు చిత్రం టీజర్, సాంగ్స్ మంచి పాపులర్ అయ్యాయి. ఇది ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : పద్మనావ్ భరద్వాజ్.













