కోల్కత్తా చిత్రోత్సవంలో అప్పూ
కోల్కత్తా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో తెలుగు సినిమా అప్పూ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 20 నుండి 27 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ చిత్రోత్సవలం జరుగుతుంది. 22న అప్పూ చిత్రం ప్రదర్శితం అవుతుందని చిత్ర దర్శకుడు కె.మోహన్ తెలిపారు. 2017లో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన మా అప్పూ చిత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మక కోల్కత్తా ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ఎంపికకావడం, 35 దేశాల నుండి వచ్చిన చిత్రాల్లో ఎంపికైన 200 సినిమాల్లో మా అప్పూ ఉండడం ఆనందంగా ఉంది అని ఆయన చెప్పారు. మాస్టర్ సాయి శ్రీవంత్ (యశస్వి) టైటిల్ పాత్రలో నటించాడు. శ్రీమతి కె.లక్ష్మి సమర్పణలో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది.













