‘ఆపిల్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన కందుకూరి
పూజా గాంధీ ప్రధాన పాత్రలో నటించిన ఆపిల్ సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ చిత్రానికి బండి వెంకట రెడ్డి సమర్పణ. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాసర రవి చిన్న నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిచిన్న మాట్లాడుతూ ఇదొక వెరైటీ చిత్రం. పూజాగాంధీ నటన ఈ చిత్రానికి హైలైట్. జేమ్స్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. మా పోస్టర్‌ను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని అన్నారు. యశస్, నాగేంద్ర, విజయచందర్, శోబరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఏం ఆర్ శీను, సంగీతం: జేమ్స్, కో ప్రొడ్యూసర్స్: శంకరబాబు, కంద్యనం శ్రీకాంత్, సమర్పణ.













