అప్పన్న పాత్ర నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందట!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్(Game Changer) నుంచి టీజర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు మారాయి. రెండ్రోజుల్లో 70 మిలియన్లు దాటేసి ట్రెండ్ అవుతుంది. ఈ రెస్పాన్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ లో చరణ్(Charan) మొత్తం మూడు షేడ్స్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆ లుక్స్ ని రివీల్ కూడా చేశారు. కాలేజ్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలతో పాటూ రైతు, రాజకీయ నాయకుడిగా కూడా చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు టీజర్ లో రివీల్ చేశారు. అయితే ఫ్యాన్స్ అందరూ రామ్, రామ్ నందన్ పాత్రలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కానీ అసలు మ్యాటర్ మొత్తం అప్పన్న పాత్రపైనే ఉంటుందట.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న పాత్ర చాలా బాగా వచ్చిందని, ఓ సమాజిక సమస్య కోసం అప్పన్న చేసే పోరాటం, పోలీసులు అప్పన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు చేతికి సంకెళ్లున్నా తన మీద దాడికి వచ్చే వాళ్లను ఎదుర్కొనే తీరు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తుందని, ఆ క్యారెక్టర్ కు సంబంధించిన కీలక ట్విస్టుతో కూడిన ముగింపు కూడా అక్కడే ఉంటుందని తెలుస్తోంది. ఎలక్షన్ ఆఫీసర్గా చరణ్ చేయబోయే విన్యాసాలన్నీ అప్పన్న ప్రభావం వల్లే ఎలివేట్ అవుతాయని, ఆన్ స్క్రీన్ పై ఈ ట్విస్టులు ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెప్తున్నారు.













