తెలుగు సినీ పరిశ్రమకు శుభవార్త : ఏపీలో టికెట్ రేట్స్‌పై జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుతూ జీవోను సోమవారం రోజున విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం కొత్త సినిమా టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం… టాలీవుడ్ చిత్రసీమకు శుభవార్త వచ్చేసింది. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినిమా టికెట్ ధరలపై పెంపు గురించి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఫిబ్రవరిలో చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్.నారాయణ మూర్తి తదితరులు ప్రత్యేకంగా వెళ్లి వై.ఎస్.జగన్‌ను కలిశారు. ఈ మీటింగ్ తర్వాత త్వరలోనే సినీ ఇండస్ట్రీకి శుభవార్త వస్తుందంటూ చిరు సహా అందరూ అనుకున్నారు. కానీ కాస్త ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుతూ జీవోను సోమవారం రోజున విడుదల చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం కొత్త సినిమా టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…
మున్సిపల్ కార్పొరేషన్స్‌లో సినిమా టికెట్ ధరలు..
నాన్ ఏసీ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం -రూ.40… ప్రీమియం – రూ.60
ఏసీ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం – రూ. 70… ప్రీమియం -రూ. 100
స్పెషల్ థియేటర్స్ నాన్ ప్రీమియం – రూ.100 …. ప్రీమియం – రూ. 125
మల్టీ ప్లెక్స్ థియేటర్స్ రెగ్యులర్ – రూ. 150.. రెక్లైనర్ – రూ. 250
మున్సిపాలిటీల్లో…
నాన్ ఏసీ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం -రూ.30 … ప్రీమియం – రూ.50
ఏసీ థియేటర్స్‌లో నాన్ ప్రీమియం – రూ. 60… ప్రీమియం -రూ. 80
స్పెషల్ థియేటర్స్ నాన్ ప్రీమియం – రూ.80 …. ప్రీమియం – రూ. 100
మల్టీ ప్లెక్స్ థియేటర్స్ రెగ్యులర్ – రూ. 125.. రెక్లైనర్ – రూ. 250













