బాలయ్యకు పద్మభూషణ్ ఖరారైనట్టేనా?
ఎన్టీఆర్(NTR) నట వారసుడు, హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) 5 దశాబ్ధాల పాటూ తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా నటిస్తూ ఇప్పటికీ వరుస హిట్లతో తన సత్తా చాటుతున్నాడు. 1974లో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించిన బాలయ్య(Balayya) రీసెంట్ గానే తన సినీ జీవితానికి సంబంధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బాలయ్య నుంచి పలు సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక, జానపద సినిమాలు వచ్చాయి.
దాంతో పాటూ గత 20 ఏళ్లుగా బాలయ్య(Balaiah) బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్(Basava tharakam Cancer Hospital) కు ఛైర్మన్ గా ఉండి సామాజిక సేవ చేస్తున్నారు. హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్న బాలయ్యకు పద్మభూషణ్(Padma Bhushan) అవార్డు ఇవ్వాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం బాలయ్యకు పద్మభూషణ్ ఇవ్వాలని కోరుతూ ఏపీలోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసిందని సమాచారం.
బాలయ్యతో పాటూ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్(Murali Mohan) పేరుని కూడా ఏపీ ప్రభుత్వం ఈ పురస్కారానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో కచ్ఛితంగా ఏపీ ప్రభుత్వ సిఫార్సులను లెక్కలోకి తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే బాలయ్య ఫ్యాన్స్ కు కొత్త ఏడాది గుడ్ న్యూస్ రావడం ఖాయం.













