టాలీవుడ్ పై ఏపీ ఎలక్షన్స్ ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఏ క్షణానైనా రాడొచ్చు. ఈసారి ఏపీలో తెలంగాణ ఎలక్షన్ల కంటే హీట్ ఎక్కువ ఉండబోతుంది. వైసీపీ, టీడీపీ- జనసేనల పొత్తుతో ఎలా తలపడనుందో అనే దానిపై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అంతర్గత సమాచారం ప్రకారం ఏపీలో నామినేషన్లు మార్చి 28 నుంచి స్టార్ట్ అవుతాయి.
ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరిగే ఛాన్సుంది. 25న రిజల్ట్స్ రానున్నాయి. ఏప్రిల్ 30నుంచి కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా షెడ్యూల్ చేస్తారని అంటున్నారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఎలక్షన్స్ ప్రచారాలతో బిజీగా ఉన్న ఏపీ జనాలు సినిమాలపై ఆసక్తితో థియేటర్లకు వచ్చే పరిస్థితి ఎంత లేదన్నా తగ్గుతుంది.
అయితే ఏప్రిల్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్యామిలీ స్టార్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ అనౌన్స్ కాలేదు. దేవర పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ ను ఫ్యామిలీ స్టార్ కొట్టేసింది. పాజిటివ్ టాక్ వస్తే రెండు వారాల్లో సినిమా సేఫ్ అయిపోతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఏప్రిల్ 19కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇంకా డిస్కషన్స్ లోనే ఉంది.
ఎలక్షన్స్ టైమ్ లో ఎందుకులే అనుకుంటే మే కు వాయిదా వేసే ఛాన్సుంది. పాన్ ఇండియా సినిమాలేవీ ఏప్రిల్ లో రిలీజ్ కు రెడీగా లేవు. ఈసారి ఏపీలో ఎలక్షన్స్ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైమ్ లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కంటే సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఏముంటుందిలే అని జనాలు లైట్ తీసుకునే ఛాన్సుంది. ఇప్పటివరకు చూసుకుంటే ఏపీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ టాలీవుడ్ సినిమాలపై పెద్దగా ఉండేట్లు లేదు.













