లక్ష్మీస్ ఎన్టీఆర్ ను మాకు చూపించండి
ఎన్టీఆర్ జీవిత చరిత్రను లక్ష్మీ పార్వతి కోణంలో తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తమకు చూపించాలని నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాతే విడుదలపై నిర్ణయం తీసుకుంటామని సృష్టం చేసింది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసే వరకూ సినిమా విడుదల ఆపాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ ముందు సినిమాను ప్రదర్శించాలని నిర్మాతను రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఆదేశించారు. ఆ తర్వాత విడుదలపై మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.













