నిర్మాతలను డైలమాలో పడేసిన స్వీటీ..!
ఏదైనా సరే సినిమా ఒప్పుకున్న తర్వాత దానికోసం కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా ఓకే చేసి కూడా కాల్షీట్స్ విషయంలో నిర్మాతలను కాస్త ఇబ్బంది పెడుతుందట స్టార్ హీరోయిన్ అనుష్క. అనుష్క గురించి ఎవరిని అడిగినా స్వీట్ అని చెప్పే అమ్మాయేనా ఇలా చేస్తుందంటే అవుననే అంటున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల పక్కన నటించి, స్టార్ హీరోయిన్ అయిన అనుష్క, అరుంధతి, భాగమతి సినిమాలతో తనకంటూ సొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకుని ఆ రేంజ్ ను పెంచుకుంటూ పోయింది. కానీ ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే అప్పుడప్పుడు పరాజయాలు పొందక తప్పదు. నిశ్శబ్ధం సినిమాతో మూగ అమ్మాయిగా ఎంతో అద్భుతంగా నటించినా సరే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మూగబోయింది. దీంతో తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ ల గురించి ఆచితూచి అడుగులు వేస్తుంది అనుష్క.
ఇప్పటికే యువీ క్రియేషన్స్ తో అనుష్క సినిమా కన్ఫర్మ్ అయింది. అది ఇంకా మొదలవక పోవడానికి కారణం స్వీటీ ఇంకా కాల్షీట్లు ఇవ్వకపోవడమేనట. స్రిప్ట్ పరంగా 100 శాతం క్లారిటీ అనిపిస్తేనే సెట్స్ కి వెళ్లాలనే ఆలోచనలో అనుష్క ఉందని కొందరంటుంటే.. డైలమా ఎందుకు కాల్షీట్లు ఇస్తే పనైపోతుంది కదా అని మరికొందరంటున్నారు. మరి దీనికి సంబంధించిన అసలు విషయం తెలియాలంటే ఇటు అనుష్క కానీ లేదంటే అటు యువీ క్రియేషన్స్ సంస్థ వారు కానీ ఏదొక క్లారిటీ ఇస్తే బెటర్.













