నేను రిలాక్స్ అవ్వలేదు. నా కొత్త సినిమాల వివరాలు త్వరలోనే తెలుస్తాయి : అనుష్క
2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `సూపర్` చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కొన్ని క్యారెక్టర్లు ఆమె కోసమే పుట్టాయా అనిపిస్తాయి. ఆయా క్యారెక్టర్లకు తనన పెర్ఫార్మెన్స్తో పూర్తి న్యాయం చేస్తుంది. ఈ 15 సంవత్సరాల్లో దాదాపు 50 సినిమాల్లో హీరోయిన్గా నటించిన అనుష్క ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోందా? అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇప్పటికే అనుష్కకు 38 సంవత్సరాలు నిండాయి. అయినా ఇప్పటికీ ఆమె పెళ్ళికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. బిల్లా, మిర్చి వంటి సినిమాల్లో ప్రభాస్, అనుష్క కలిసి నటించడంతో వీరిద్దరి పెయిర్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బాహుబలి సిరీస్ కోసం ఎక్కువ రోజులు పనిచేయడంతో వారి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. తామిద్దరం మంచి స్నేహితులమని, తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఇద్దరూ పలు సందర్భాల్లో ఖండిచినప్పటికీ వీరికి సంబంధించిన రూమర్స్ మాత్రం ఆగలేదు.
బాహుబలి తర్వాత అనుష్క చేసింది మూడు సినిమాలే. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా ఏమీ ఉన్నట్టు లేదు. ఈమధ్యకాలంలో అనుష్క లుక్స్ చూసిన ఎవరికైనా ఆమె రిలాక్స్ అయిపోయిందని, సినిమాలు చేసే ఉద్దేశం ఆమెకు లేనట్టుగా ఉందని అనిపిస్తుంది. అంటే ఆమె పెళ్ళికి సిద్ధమవుతోందని, అందుకే సినిమాలు అంగీకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని, ప్రస్తుతం కథలు వింటున్నానని, త్వరలోనే తన కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ఆయా నిర్మాతలు వెల్లడిస్తారని చెబుతోంది. అనుష్క చెబుతున్న మాటల్లో వాస్తవమేమిటో తెలుసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.













