లేడీ ఓరియెంటెడ్ కే అనుష్క పరిమితమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క బాహుబలి తర్వాత దాదాపు ఏడాది పాటు కెమేరాకు దూరంగా ఉన్నారామో. మళ్లీ ఇన్నాళ్లకు మేకప్‌కు సిద్ధం అయ్యింది. ఈ సమయంలో అన్నీ లేడీ ఓరియెంటెడ్ సినిమా పాత్రలే దక్కుతున్నాయి. ఇప్పటికే తెలుగులో ఒక చిత్రానికి కమిట్ అయ్యింది. ఈ సినిమాలో కీలక పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా స్వామి అయ్యప్ప కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా అనుష్క నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అయ్యప్పపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అనుష్కతో తీయబోతున్న సినిమా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం అమ్మడిని గ్లామర్ పాత్రల్లో చూడాలని కోరుకుంటూ ఉండగా, అనుష్క మాత్రం అందుకు భిన్నమైన పాత్రలో నటిస్తున్నారేంటి అనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.













