సైరాలో అతిధిగా అనుష్క ?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైరా చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో గ్లామర్ భామ అనుష్క ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందట. ఇప్పటికే హీరోయిన్స్‌గా నయనతార, తమన్నాలు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రత్యేక పాత్ర కోసం అనుష్కను ఎంచుకున్నారట. ఈ పాత్ర కేవలం అనుష్క మాత్రమే చేయగలదని భావించిన మేకర్స్ ఆమెతో చర్చలు జరిపి ఓకే చేయించారట. టాలీవుడ్లో అనుష్క అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన అనుష్క.. భాగమతి తరువాత సినిమాలు చేయడం లేదు. దాని కారణం జీరో సైజ్ సినిమాకోసం బాగా బరువు పెరగడంతో ఇప్పుడు ఆ బరువు తగ్గే పనిలో ఉంది. మొత్తానికి అనుష్క కీరోల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.













