ఎన్ఆర్ఐ అమ్మాయిగా అనుష్క ?
భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుండి మొదలు కానుంది. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగనుంది. ఈ చిత్రంలో అనుష్క ఎన్ఆర్ఐ అమ్మాయిగా కనిపించనుండగా అంజలి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నటించనుంది. ఈ చిత్రంలో మాధవన్, సుబ్బరాజ్, షాలిని పాండేతో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళంలో కూడా విడుదల చేస్తారు.













