Mega158: చిరూతో అనుష్క?

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) వయసుని లెక్క చేయకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ విశ్వంభర(Viswambhara) సినిమాను పూర్తి చేసిన చిరూ(chiru), ప్రస్తుతం అనిల్ రావిపూడి(anil ravipudi)తో కలిసి మన శంకరవరప్రసాద్ గారు(mana Shankaravaraprasad Garu) చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాబీ కొల్లి(Bobby kolli)తో ఓ సినిమాను, శ్రీకాంత్ ఓదెల(srikanth odela)తో ఓ సినిమాను లైన్ లో పెట్టారు చిరూ.
అనిల్ సినిమా తర్వాత చిరంజీవి ముందుగా బాబీ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అందులో భాగంగానే మొన్న చిరూ బర్త్ డే సందర్భంగా సినిమాను అనౌన్స్ కూడా చేశారు. మెగాస్టార్ కెరీర్లో 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం బాబీ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య(waltair veerayya) వచ్చి పెద్ద హిట్ అవడంతో దీనిపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా బాబీ మెగా158(Mega158)ను ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(anushka shetty)ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని బాబీ భావిస్తున్నాడట. ఇప్పటివరకు చిరూ, అనుష్క కలిసి ఒక్క ఫుల్ లెంగ్త్ మూవీ కూడా చేయకపోవడంతో బాబీ ఇలా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇందులో నిజమెంతన్నది పక్కన పెడితే నిజమైతే ఈ మెగా ఆఫర్ ను స్వీటీ(Sweety) ఒప్పుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.