Anushka Shetty: ఆ సీక్వెల్ లో అనుష్క?

టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఉన్నట్టే స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే ఎవరైనా సరే స్వీటీ(Sweety) అనుష్క శెట్టి(Anushka Shetty) పేరే చెప్తారు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అనుష్క ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సూపర్ హిట్లు అందుకుని మంచి కలెక్షన్లు వసూలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచింది.
బాహుబలి(Baahubali) తర్వాత అనుష్క క్రేజ్, మార్కెట్ విపరీతంగా పెరిగాయి. దీంతో ఆ క్రేజ్ ను వాడుకుని వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతుందనుకుంటే అనుష్క మాత్రం సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ చాలా తక్కువ సినిమాలను చేస్తుంది. అనుష్క నుంచి ఆఖరిగా సినిమా వచ్చి కూడా రెండేళ్లవుతుంది. ఇప్పుడు అనుష్క క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ఘాటి(Ghaati) అనే సినిమా చేసింది.
ఘాటి సినిమా జులై 11న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న టైమ్ లో ఆమె గురించి ఓ వార్త నెట్టింట ప్రచారమవుతుంది. కార్తీ(Karthi) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రానున్న ఖైదీ2(Khaidhi2) సినిమాలో అనుష్క కనిపించనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ ఈ వార్తలు విన్న అనుష్క ఫ్యాన్స్ మాత్రం భలే ఖుషీ అవుతున్నారు.