Khaidhi2: ఖైదీ2లో అనుష్క?

కార్తీ(Karthi) హీరోగా వచ్చిన ఖైదీ(Khaidhi) సినిమాకు సీక్వెల్ గా ఖైదీ2(Khaidhi2) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka Shetty) దిల్లీకి భార్యగా నటిస్తుందని, సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అనుష్క ఖైదీ2 లో నటిస్తుందని తెలిశాక ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఖైదీ2లో అనుష్క పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అంతేకాదు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగా ఖైదీ2లో కమల్ హాసన్(Kamal hassan) విక్రమ్(Vikram) గా, సూర్య(Suriya) రోలెక్స్(Rolex) గా తిరిగి వస్తారని అంటున్నారు. అదే నిజమైతే వీరందరి క్యామియోలతో ఖైదీ2 సౌత్ ఇండియాలోనే పెద్ద సినిమాగా మారే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉంటే అనుష్క, కార్తీ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోవడం కొత్తేం కాదు, ఆల్రెడీ వీరిద్దరూ కలిసి గతంలో అలెక్స్ పాండియన్(Alex pandiyan) లో నటించారు. ఆ తర్వాత శకుని(Sakuni), ఊపిరి(Oopiri) సినిమాల్లో అనుష్క గెస్ట్ రోల్ లో మెరిసింది. ఇప్పుడు ఖైదీ2లో నటిస్తే వీరిద్దరి కాంబినేషన్ కు ఆ సినిమాపై హైప్ పెరగడం ఖాయం. ఇక అనుష్క విషయానికొస్తే, ఆమె క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో నటించిన ఘాటి(Ghaati) సినిమా జులై 11న రిలీజ్ కానుంది.