యాక్టింగ్ కు దూరం కానున్న అనుష్క?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే వామిక అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వామికకు తోడుగా మరో బిడ్డను వారు కనాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం తెలిసిన నుంచి అనుష్క, విరాట్లు వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అనుష్క, విరాట్ ఇద్దరూ కలిసి క్లినికల్ దగ్గర ఎక్కువ సార్లు కనిపిస్తుండటంతో ఈ వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు వారి ఫోటోలను తీయొద్దని ఈ జంట ఫోటోగ్రాఫర్లను రిక్వెస్ట్ చేశారట. ఇప్పటికే వామికతో బిజీగా ఉన్న అనుష్కకు తమ రెండవ బిడ్డ వచ్చాక మరింత బాధ్యతలు పెరుగుతాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క కుటుంబం, పిల్లల కోసం తన వృత్తిని వదిలివేయడం గురించి మాట్లాడింది.
ఈ ఇంటర్వ్యూలో అనుష్క, పెళ్లి పిల్లలు తన లైఫ్ లో ఎంతో ముఖ్యమైన అంశాలని చెప్తూ, అవసరమైతే వారి కోసం తన కెరీర్ అయిన యాక్టింగ్ ను వదిలేయడానికి కూడా రెడీ అని హింట్ ఇచ్చింది. తనకు పెళ్లి చేసుకుని పిల్లలతో ఉండటం చాలా ఇష్టమని అనుష్క ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. మరి అనుష్క రెండవ బిడ్డకు జన్మనిచ్చాక సినిమాల్లో నటిస్తుందా లేదా యాక్టింగ్ వదిలేసి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుందా లేదంటే అన్నీ వదిలేసి పిల్లల సంరక్షణ మాత్రమే చూసుకుంటుందా అనేది చూడాలి.













