నేను నిర్మిస్తున్నా కానీ… నటించడం లేదు
అనుష్క శర్మ తొలి చిత్రం రబ్ నే బనాదీ జోడీ కథానాయకుడు షారుఖ్‌ఖాన్. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి జీరో లో నటిస్తున్నారు. డిసెంబరు నుంచి ఈ సినిమా ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటిస్తే మనకు తెలియకుండానే పాత్రలోకి సులువుగా ప్రవేశిస్తాం. తొలి చిత్రం నుంచి ఆయన నా విషయంలో చాలా సహాయంగా ఉండేవారు. నా తీరు వల్ల కాదు ఆయన సెట్లో ఉండే విధానంతోనే బాగా నటించగలిగాను అని చెప్పింది అనుష్క. త్వరలోనే ఆమె మరో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనుంది. అమెజాన్ ప్రైమ్‌తో కలిసి ఓ ప్రాజెక్టును చేయబోతున్నాం. జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. నేను నిర్మిస్తున్నా కానీ ఇందులో నటించడం లేదు అని చెప్పింది అనుష్క శర్మ. ఎన్‌హెచ్ 10, పరి చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మించింది అనుష్క.













