టాలీవుడ్ వ్యాపార రంగంలోకి అనుష్కశర్మ రానుందా?
అలనాడు తెలుగువాడి ఉనికిని, కీర్తిని గుర్త్తింపుని ప్రపంచం నలుమూలల వ్యాపింపచేసినది మహానటుడు యన్.టి.ఆర్ అయితే… బాహుబలి చిత్రంతో దేశ విదేశాలలో తెలుగువాడి సినిమా సత్తా చాటుతూ ఎవరు కనివిని ఎరుగని, బాలీవుడ్ కి కూడా సాధ్యం కాని ఫీట్‌ని ఒక డబ్బింగ్ చిత్రంలో తన స్టామినాను చూపించాడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి నుండి తెలుగు చిత్రాలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తోంది. అంతే కాదు తెలుగు చిత్రాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ కి కూడా మంచి రేట్ పలుకుతుంది. ఇందులో భాగంగా పెద్ద హీరోల స్టార్స్ చిత్రాలే కాదు.. రామ్, నితిన్ వంటి వారి ఫ్లాప్ చిత్రాలకు కూడా బాలీవుడ్లో విశేష ఆదరణ లభిస్తోంది. అర్జున్ రెడ్డి వంటి చిత్రాన్ని రీమేక్ చేసి అక్కడకూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది ప్రస్తుతం జెర్సీ, ఆర్ ఎక్స్ 100, ఎఫ్ 2 వంటి పలు చిత్రాలను బాలీవుడ్ లోకి రీమేక్ చేసే పనిలో ఉన్నారు. నిర్మాతలు.
బాలీవుడ్‌లోని ప్రముఖులందరు టాలీవుడ్ పై ఓకన్నేసి ఉంచుతున్నారు. మరికొందరు నిర్మాతలుగా తెలుగులోకి ఎంటర్ కావాలని ఆశపడుతున్నారు. అసలు విషయానికి వస్తే ‘రబ్ నే బనాదీ జోడీ’ చిత్రం ద్వారా హీరోయినిగా పరిచయమైన అనుష్కశర్మ. చూపుల్లో చురుకుతనం, నవ్వులో కొంటెతనం, నడకలో గడసరి తనం, మాటల్లో అమాయకత్వం వంటి వన్నీ కలిపితే ఆమె అనుష్కశర్మ అని చెప్పవచ్చు. ఈమె అందానికి ముగ్దుడై ఏకంగా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి ఆమెని వివాహం చేసుకోవడంతో పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా ఎవరికైన పెళ్లి తర్వాత గ్యాప్ వస్తుంది.కానీ అనుష్కశర్మ మాత్రం వివాహం తర్వాత కూడా బిజీ గా వుంది . ఓ వైపు నిర్మాతగా మారి సినిమా నిర్మాణం, మరో వైపు భర్త విరాట్ పనులు, క్లాత్ బిజినెస్ అంటూ బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా ఈమె కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమాలకు గ్యాప్ తీసుకుంది. 2018లో పారీ, సంజు, సుయ్ దాగా, జీరో వంటి చిత్రాలలో నటించింది.
గత ఏడాది ఒక్క చిత్రంలో కూడా కనిపించని ఈమె 2020లో మార్చి లో విడుదలైన ‘అంగ్రేజీ మీడియం’ చిత్రం లో కనిపించింది. ఆమె తల్లి కావడానికే ఇలా విరామం తీసుకుంటోందని వార్తలు సోషల్ మీడియా లో షికారు చేస్తున్నాయి . కానీ అందులో నిజం లేదని, తనకి నచ్చిన కథలు రాకపోవడం వల్లనే సినిమాలలో నటించడం లేదని ఆమె తెలిపింది. నాకు నచ్చి న కథ దొరికితే నటించడమే కాదు.. ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానని కూడా ఈమె చెప్పింది. ఇక త్వరలో రెండు చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు రానున్నానని తెలిపింది. అయితే ఆమె ఎక్కువగా బిజినెస్ వ్యవహారాలలో బిజీ కావడం వల్లనే సినిమాలను తగ్గిస్తోందని బాలీవుడ్ వారు అంటున్నారు. ఈ నేపధ్యంలో అనుష్కశర్మ తెలుగు చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టిందని సమాచారం. అయితే నటిగా కాకుండా ఇక్కడి భారీ నిర్మాత ఎవరితోనైనా టైఅప్ అయి కొన్ని చిత్రాలను నిర్మించాలని, ఆ తర్వాత తానే సొంతంగా తెలుగు చిత్రాలను నిర్మించాలని కూడా ఈమె భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. తన ప్రొడక్షన్ కంపెనీ బ్రాండ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఎక్కువగా తనకిష్టమైన థ్రిల్లర్ జోనర్ లో చిత్రాలు చేయాలని ఈమె భావిస్తోందిట. గోపీచంద్ సౌర్యం చిత్రం తో తెలుగులో ఎంట్రీ రావాల్సింది ఎందుకో అప్పుడు కుదరలేదు.
అదే సమయంలో ఆమెకి షారుఖ్ ఖాన్ హీరోగా ‘కింగ్ ఖాన్’ నటించే చిత్రంలో అవకాశం రావడంతో తెలుగులో నటించలేదు. మొత్తానికి అనుష్క త్వరలో తెలుగు చిత్రాల ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనుందని విశ్వసనీయ సమాచారం. తెలుగులోనే కాదు… తన బేనర్ ని అన్ని భాషల్లోకి విస్తరింపజేయాలనే ఆలోచనలో ఈమె ఉందిట. మొత్తానికి విరాట్ కోహ్లి అండతో ఈమె బిజినెస్ వుమెన్ గా కూడా తన సత్తా చాటాలని తెగ ప్రయత్నం చేస్తుంది.













