పదేండ్ల కేరీర్ లో అరుదైన గౌరవం
బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మకు ప్రతిష్టాత్మక స్మితాపాటిల్ అవార్డు లభించింది. ముంబయిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె స్వీకరించారు. 2008లో రబ్ నే బనా ది జోడీ చిత్రంలో బాలీవుడ్లోకి అడుగుపెట్టి అనుష్క శర్మ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత బ్యాండ్ బాజా బారాత్, పాటియాలా హౌస్, జబ్ తక్ హై జాన్, పీకే, ఎన్హెచ్ 10, బాంబే వెల్వెట్, సూల్తాన్, ఎ దిల్ హై ముష్కిల్, పరి, సంజు లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక స్మితాపాటిల్ అవార్డు అందుకోవడం గౌరవంగా, గొప్ప ప్రశంసగా భావిస్తున్నా. నేను బాలీవుడ్లో అడుగుపెట్టి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డు రావడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నాం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి గైడెన్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. డిఫరెంట్ కథా చిత్రాలు చేసుకుంటూ ఈ స్థాయికి రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ అనుష్క శర్మ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.













