నువ్వు ఏదీ కోరుకుంటే అదే ఇస్తుంది!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా బాలీవుడ్లో అడుగుపెట్టి ఇప్పుడు అగ్ర కథానాయికగా కొనసాగుతోంది అనుష్క శర్మ. రబ్ నే బనా దీ జోడీ లో షారుఖ్‌తో మొదలైన ఆమె ప్రయాణం నటిగా ఆమెకు ఎన్నో ప్రశంసలు అందించింది. నిర్మాతగానూ విజయాలు అందుకొంటోందామో. ఒక్కసారి తన ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే కృతజ్ఞత పూర్వక భావనే కలుగుతోందట అనుష్కకి. ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన ఆ దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. చిత్ర పరిశ్రమ నేర్పినన్ని విషయాలు ఏ రంగంలోనూ నేర్చుకోలేము. అదే సమయంలో ఏ రంగంలోనూ ఎదురు కానీ పరీక్షలు ఇక్కడ ఎదురవుతుంటాయి అని చెప్పింది. తనను ఓ మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది చిత్ర పరిశ్రమే అని చెబుతోంది అనుష్క. ఈ రోజు నేను వ్యక్తిత్వం ఉన్న మనిషిగా నిలబడ్డానంటే కారణం చిత్ర పరిశ్రమే. సరిగ్గా నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది పరిశ్రమ. కాస్త ఎక్కువ తక్కువ ఇవ్వదు అని చెప్పింది అనుష్క. అమె నటించిన సుయీ ధాగా విడుదలకు సిద్ధమతోంది.













