అనుష్కకు లీగల్ నోటీసు
ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, ఎప్పుడైతే ప్రపంచం గుప్పిట్లోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని రంగాల్లోనూ వివాదాలకు తావిచ్చినట్టయింది. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. నిజంగా పొరపాటు జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి టెక్నాలజీ ఉండనే ఉంది. దాని సాయంతో సులభంగా ఆయా వ్యక్తులను కోర్టుకు లాగే అవకాశం ఉంటోంది. ఇలాంటి వివాదాలు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా వస్తుంటాయి. తాజాగా ఓ వెబ్‌సిరీస్ విషయంలో రేకెత్తిన వివాదం వల్ల ఆ వెబ్‌సిరీస్‌కి సహనిర్మాతగా వ్యవహరించినందుకుగాను అనుష్క శర్మ కోర్టు లీగల్ నోటీసులు పంపించింది.
విషయానికి వస్తే…అనుష్క సహ నిర్మాతగా వ్యవహరించిన `పాతాళ్‌లోక్` అనే వెబ్ సిరీస్‌లో జాతి వివక్షను ప్రేరేపించే వ్యాఖ్యలు ఉన్నాయని వీరేన్ శ్రీ గురుంగ్ అనే న్యాయవాది అనుష్కకు నోటీసులు పంపాడు. `పాతాళ్ లోక్` వెబ్ సిరీస్‌లో ఓ నేపాలీని ఇంటరాగేట్ చేసే పోలీస్ అధికారి చెప్పే డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో అనుష్కకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆ వెబ్ సిరీస్‌కు సహనిర్మాతగా వ్యవహరించినందుకే ఆమెకు నోటీసులు పంపించాల్సి వచ్చిందని శ్రీగురుంగ్ తెలిపారు. గతంలోనూ ఈ వెబ్‌సిరీస్ విమర్శలను ఎదుర్కొంది. అప్పుడు కొన్ని సీన్స్‌లో డైలాగ్స్ లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉన్నాయని ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఈసారి మాత్రం కోర్టు నోటీసులు పంపారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.













