ఐపీఎల్ లో అనుష్క ఏం చేసిందో తెలుసా?
ఐపీఎల్లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క సందడి చేసింది. మ్యాచ్ చూసేందుకు రెండు రోజుల ముందే బెంగళూరు వచ్చిన అనుష్క, ప్రీతి జింతాతో కలిసి సందడి చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించిన పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్న వేళ గ్యాలరీలో ఉన్న అనుష్క భర్తకు ప్లైయింగ్ కిస్‌లు విసురుతూ కనిపించింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కిస్‌లతో ఆగని అనుష్క కోహ్లీకి ఫోన్ చేసి రమ్మని పిలిచిన వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.













