ప్రభాస్ ను సర్ ప్రైజ్ చేసిన స్వీటీ
ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తాజా చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలోని కోమోలో జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న లోకేషన్‌కు అనుష్క వచ్చి ప్రభాస్‌కు సర్ప్రైజ్ ఇచ్చిందని టాక్. ఇటలీలో ఉన్న తెలుగు వారు డార్లింగ్ ను చూసేందుకు షూటింగ్ లోకేషన్‌కు వెళ్తే అక్కడ స్వీటీ ఉండం చూసి సర్ప్రైజ్ అయ్యారట. అనుష్క రీసెంట్గా ఆస్ట్రియా దేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రఖ్యాత వివామేర్ స్పాలో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకుందని ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నాయి. యూరోప్ ఖండమే కాబట్టి పనిలో పనిగా ప్రభాస్‌కు హాయ్ చెప్పి వెళ్దామని వచ్చిందేమో అంటున్నారు.













