సంక్రాంతి సై అంటున్న భాగమతి
అందాల రాక్షసి అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్సెన్స్ థ్రిల్లర్ సైలెన్స్. తెలుగులో ఈ సినిమా నిశ్శబ్దం గా రానుంది. షూటింగ్ పూర్తి చేసుక్ను ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్‌గా కనిపిస్తుండగా.. మాధవన్ సెల్లో ప్లేయర్‌గా నటిస్తున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని సమాచారం. సుబ్బరాజు, అంజలి, షాలిని పాండేతో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భాగమతి గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













