ప్రభాస్‌కు అనుష్క ఇచ్చిన గిఫ్ట్ ఎంటో తెలుసా?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సోమవారం తన 38వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దేవసేన అనుష్క డిజైనర్ వాచ్‌ను కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రభాస్‌కి చేతి గడియారాలంటే చాలా ఇష్టమట. ఇందుకోసం అనుష్క ప్రభాస్‌కి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వాచ్ కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. బహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు డిసెంబర్లో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరగబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. వీటిపై ప్రభాస్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించద్దని పేర్నొన్నారు.













