మలయాళ ఘోస్ట్ గా షాకివ్వనున్న స్వీటీ
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి హిట్ అందుకున్న అనుష్క, ఆ సినిమా సక్సెస్ మీట్ టైమ్ లో కూడా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు సడెన్ గా అనుష్క మలయాళం మూవీ కథనర్ సెట్స్ లో అడుగుపెట్టింది. అప్పట్లో చిరూ విశ్వంభరలో నటిస్తుందన్నారు కానీ ఆ సినిమాను స్వీటీ వద్దనుకుంది. ఫలితంగా ఆ సినిమా ఛాన్స్ ను త్రిష అందుకుంది.
ఇప్పుడు అనుష్క మలయాళ సినిమా కథనర్ లో ఘోస్ట్ తరహా పాత్ర చేయబోతుందని కేరళ మీడియా వర్గాలంటున్నాయి. కథనర్ అంటే 9వ శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత యోధుడి కథ. ఆయన హయాంలోనే కల్లియన్ కట్టు నీలి అనే అమ్మాయి ఉండేది. ట్రావెన్కోర్ కు సంబంధించిన జానపద పాటల్లో నీలి ప్రస్తావన లేకుండా పాటలే పాడరు. అందమైన దేవత రూపంలో ఉండే దెయ్యంగా నీలి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.
దేవదాసి కూతురిగా పుట్టి ఫ్యామిలీలో జరిగే కొన్ని పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే క్రమంలో చాలా డ్రామా ఉంటుంది. ఇప్పుడు ఆ నీలి పాత్రలోనే అనుష్క నటించబోతుంది. ఈ వివరాలన్నీ యూనిట్ సభ్యులు ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ విశ్వసనీయ వర్గాల నుంచే ఈ సమాచారం అందుతుంది. మొత్తం రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో ఎన్నో షాకింగ్ ఎలిమెంట్స్, ఊహించని ఎపిసోడ్లు ఉంటాయట. మొత్తానికి అనుష్కను ఇప్పటివరకు చూడని పాత్రలో కొత్తగా చూడనున్నామన్నమాట.













