Baahubali Re Union: అనుష్క అందుకే డుమ్మా కొట్టిందా?

రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(prabhas) హీరోగా వచ్చిన బాహుబలి(baahubali) సినిమా ఎంత పెద్ద హిట్టనేది కొత్తగా చెప్పే పన్లేదు. ఆ సినిమా రిలీజై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ అయ్యారు. ఈ రీయూనియన్ లో బాహుబలి కోసం పని చేసిన వారంతా కనిపించారు. కానీ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి(anushka shetty) మాత్రం ఈ సెలబ్రేషన్స్ కు రాలేదు.
అందరి లానే అనుష్క ను చాలా ముందుగానే ఈ రీయూనియన్ కు ఇన్వైట్ చేయగా, ఆమె కూడా వస్తానని చెప్పారట. కానీ తర్వాత పర్సనల్ రీజన్స్ అని చెప్తూ ఈ సెలబ్రేషన్స్ కు అనుష్క డుమ్మా కొట్టింది. అయితే బరువు తగ్గడం లాంటి సమస్య కారణంతోనే అనుష్క ఈ ఈవెంట్ కు రాలేదని తెలుస్తోంది. దానికి తోడు తన రాబోయే సినిమా ఘాటీ(Ghaati) కు ముందు ఎక్కడా బయట కనిపించడం అనుష్కకు ఇష్టం లేదని అందుకే రాలేదని అంటున్నారు.
ఘాటీ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అనుష్క ముందుగానే చిత్ర యూనిట్ కు క్లారిటీ ఇచ్చిందని, రెండు మూడు ఈవెంట్స్ కు మాత్రమే వస్తానని, మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటానని అనుష్క ఇప్పటికే దర్శకనిర్మాతలకు చెప్పిందని తెలుస్తోంది. కాగా బాహుబలి రీ యూనియన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.