లేడీ ఓరియెంటెడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అనుష్క. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా తీయాలంటే ముందుగా అందరికి గుర్తుకి వచ్చేది అనుష్క పేరే. అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలలో నటించి తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. భాగమతి విడుదలైన చాలా రోజులు అవుతున్న తన తర్వాతి సినిమాకి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం అనుష్క చేయబోవు సినిమాకి సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అనుష్కకి నూతన దర్శకుడు హేమంత్ కథానాయిక ప్రాధాన్యత కలిగిన స్టోరీ వినిపించాడట. ఇది అనుష్కకి ఎంతగానో నచ్చేసిందట. దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కోన కార్పోరేషన్, పీపుల్స్ మీడియా వారు ఈ సినిమాను సంయ్తుంగా నిర్మించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో అనుష్క సరసన మాధవన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.













