డిప్రెషన్ కి గురయ్యానంటున్న టాలెంటెడ్ ఫిలిం మేకర్ …..
బాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుడిగా మరియు నటుడిగా పేరు తెచ్చుకున్నారు అనురాగ్ కశ్యప్. ” గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్” , ” బాంబేవెల్వెట్ ” లాంటి ప్రసిద్ధ నెట్ ఫ్లిక్స్ సిరీస్, లవ్ స్టోరీస్ వంటి చిత్రాలతో అందరికి సుపరిచుడు అయ్యారు అనురాగ్. తాజాగా ఈ దర్శకుడు తాప్సి నటించిన ” దోబారా ” తో మరోసారి బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్నారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న అనురాగ్ కశ్యప్ , ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ” తాను డిప్రెషన్ లో ఉన్నానని, దాని నుండి బయట పడడానికి రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్లానని ” అని అనురాగ్ తెలిపారు.
ఇదే విషయాన్ని వివరిస్తూ 2019 లో తాను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన కూతురికి అత్యాచార బెదిరింపులు వచ్చాయి అని అయన తెలిపారు. చాలా మానసిక క్షోభ తర్వాత తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసినట్టు, అది కూడా తన గుండెపోటుకు కారణం అయినట్టు కశ్యప్ చెప్పారు. కుటుంబం తో పోర్చుగల్ వెళిపోయానని, సినిమా షూటింగ్ కారణంగా కొద్ది రోజుల క్రితం భారత్ కి వచ్చానని తెలిపారు. చేసే చిత్రాలు ఆగిపోయి, వెబ్ సిరీస్ ఆలస్యమై, ఆ వత్తిడి అంతా ఒకేసారి తన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించింది అన్నారు. వీటన్నిటిని ఎదుర్కొని ప్రస్తుతం వర్క్ లో బిజీ గా ఉన్నట్టు ఆయన తెలిపారు.
ప్రస్తుతం “మొహబ్బత్” అనే చిత్రాన్ని ఆయన చిత్రీకరిస్తుండగా, మరికొన్ని వెబ్ సిరీస్ ని కూడా తీసే పనిలో ఉన్నట్టు సమాచారం. అనురాగ్ తాను జీవితంలో ఎదుర్కున్న దారుణమైన పరిస్థితులని వివరించడం తో, ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.













