అనుపమ బాగానే తీసుకుంటుందిగా
టాలీవుడ్ అనుపమ పరమేశ్వరన్ తనకంటూ స్పెషల్ క్రేజ్ ను ఏర్పరచుకుంది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్న అనుపమ, మొదట్లో పక్కింటి అమ్మాయిలాంటి పాత్రలు మాత్రమే చేసింది. కానీ ఇప్పుడు స్లిమ్ అయ్యి గ్లామర్ షోకు రెడీ అవడంతో అమ్మడుకి ఛాన్సులు బాగా పెరుగుతున్నాయి. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు సైతం చేయడానికి అనుపమ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
దానికి నిదర్శనమే టిల్లూ స్వ్కేర్ సినిమా. ఈ సినిమా ట్రైలర్లో అనుపమను చూశాక అందరూ షాకయ్యారు. గతంలో దిల్ రాజు బ్యానర్ లో రౌడీ బాయ్స్ చేసిన అనుపమ, ఇప్పుడు టిల్లూ స్వ్కేర్ లో మరింత గ్లామర్ షో చేస్తుంది. టిల్లూ స్వ్కేర్ లో ఏకంగా కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించింది అనుపమ. చూస్తుంటే ఈ సినిమా అనుపమకు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చేలా ఉంది.
మార్చి 29న రిలీజ్ కానున్న టిల్లూ స్వ్కేర్ కోసం అనుపమ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అనుపమ ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తన పాత్ర బోల్డ్ గా ఉండటంతోనే అనుపమ ఈ మేరకు ఛార్జ్ చేసిందట. అంటే ఇకపై సినిమాలో పాత్రను బట్టి అనుపమ రెమ్యూనరేషన్ తీసుకోబోతుందన్నమాట.













