అనుపమ ఆ సినిమా ఎందుకు చేసింది?
కెరీర్ స్టార్టింగ్ లో పక్కింటి అమ్మాయి పాత్రల్లో కనిపించిన అనుపమ ఇప్పుడు స్లిమ్ అయ్యి, మరింత గ్లామర్ గా కనిపిస్తూ స్కిన్ షో కు కూడా రెడీ అయింది. కార్తికేయ2 తో పెద్ద హిట్ అందుకున్నా ఆ తర్వాత చేసిన 18 పేజెస్ యావరేజ్ అనిపించుకుంది. అయితే రీసెంట్ గా అనుపమ నటించిన టిల్లూ స్వ్కేర్ ట్రైలర్ చూశాక అనుపమ ఫ్యాన్స్ ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారు.
అయితే అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా సైరెన్ రీసెంట్ గా తమిళ్ లో రిలీజైంది. ఈ శుక్రవారం తెలుగులో కూడా రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే రిలీజైన ఒరిజినల్ వెర్షన్ కి కూడా అంతగా మంచి రెస్పాన్స్ రాలేదు. అలా అని సినిమాలో ఏమైనా క్యాస్టింగ్ లోపమా అంటే కాదు.
జయం రవి ప్రధాన పాత్రలో ఒకటికి రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. కీర్తి సురేష్ సినిమా మొత్తం కనిపించే పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించింది. కానీ అనుపమకు మాత్రం సినిమాలో కనీసం డైలాగులు కూడా లేవు. అంతేకాదు సినిమాలో అనుపమ కనిపించేది కూడా చాలా తక్కువ సేపే. మరి ఇలాంటి పాత్ర అనుపమ ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. విలన్లలో ఒకడిగా టాలీవుడ్ నటుడు అజయ్ కనిపిస్తాడు. మొత్తానికి రొటీన్ సినిమాగా సైరన్ మిగిలిపోయింది. తెలుగులో తర్వాతైనా రిలీజవుతుందా లేదా అయలాన్ లాగా కేవలం అనౌన్స్మెంట్ కు పరిమితమవుతుందా అనేది చూడాలి.













